వినుకొండలో ప్రజలు రోడ్లపై వాహనాల్లో ఎల్ఈడీ హెడ్ లైట్ల వాడకంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అత్యంత కాంతివంతమైన లైట్ల వల్ల ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్ల కళ్ళలో పడి రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయని బాధితులు తెలిపారు. చట్టప్రకారం వీటిని హెడ్ లైట్లుగా వాడకూడదని, అయినప్పటికీ 80 శాతం వాహనాల్లో వీటినే వాడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే వీటి వాడకాన్ని నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.