వినుకొండలో కుక్క అడ్డురావడంతో బైక్ ప్రమాదం –యువకుడికి గాయాలు

1496చూసినవారు
వినుకొండలో కుక్క అడ్డురావడంతో బైక్ ప్రమాదం –యువకుడికి గాయాలు
వినుకొండ హనుమాన్ నగర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారామపురం తండాకు చెందిన వడితే తౌరియా నాయక్ ద్విచక్ర వాహనంపై వినుకొండ వైపు వస్తుండగా, అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్