వినుకొండ నరసరావుపేట రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట డ్రైనేజీలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. దుర్వాసనతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.