గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై శావల్యాపురం మండలం కృష్ణాపురం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని బోలెరో వాహనం ఢీకొట్టింది. మద్యం మత్తులో వేగంగా నడిపిన బోలెరో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.