పింఛన్ల పంపిణీ బహిష్కరించిన బొగ్గరం గ్రామస్థులు

909చూసినవారు
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలోని బొగ్గరం గ్రామస్థులు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని బహిష్కరించారు. 3 వేల జనాభా ఉన్న తమ గ్రామంలోనే సచివాలయ సేవలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెదకొండాయపాలెంలో సేవలు జరుగుతున్నాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయుల హామీతో మూడు రోజులు బొగ్గరంలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, పెదకొండాయపాలెం స్థానికులు సిబ్బందిని అడ్డుకోవడంతో, దీనికి నిరసనగా పింఛన్ల కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్