పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో గుర్తుతెలియని దుండగులు రైతు బొల్లా వీరాంజికి చెందిన సుమారు 160 డ్రిప్ ఇరిగేషన్ పైపులకు నిప్పుపెట్టి తగలబెట్టారు. ఈ ఘటనలో దాదాపు రూ. 3.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతు కోరారు.