వినుకొండ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం కార్యాలయంలో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి మన్నే వెంకటేశ్వరరావు, శ్రీమతి చెంచమ్మల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. సంఘ కార్యక్రమాల గురించి భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయని, సభ్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి నాగేంద్రుడు, కృష్ణమూర్తి, సిహెచ్ రఘు మాస్టారు, అవ్వారు కోటేశ్వరరావు, వై వి సుబ్బయ్య శర్మ, రామలింగేశ్వరరావు, ఎం వి శర్మ, మురళీధర్, శేషయ్య, ఆది రాములు, వెంకటేశ్వరరావు, శంకర్రావు పాల్గొన్నారు.