పాల కోసం వెళుతూ అనంత లోకానికి చేరుకున్నాడు

5చూసినవారు
పాల కోసం వెళుతూ అనంత లోకానికి చేరుకున్నాడు
పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శావల్యాపురం మండలం కనమర్లపూడిలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి పూర్తి చేసిన రవీంద్ర అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి పాలు తీసుకురావడానికి బైక్‌పై గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపైకి వచ్చిన సమయంలో వినుకొండ నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్న ట్రాలీ ఆటో అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్లముందే మృతదేహంగా మారిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you