వినుకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొల్లాపల్లి మండలం, వెల్లటూరు గ్రామానికి చెందిన సుమారు 100 ముదిరాజ్ కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాల సభ్యులు తెలిపారు.