గురువారం ఈపూరు మండలం గుండేపల్లి గ్రామంలో మొండితోక ఏలిసా అనే రైతు తన గేదెలను వాగు సమీపంలో మేతకు తీసుకెళ్లారు. అక్కడ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ సపోర్ట్ వైరుకు విద్యుత్ ప్రవహించడంతో, మేత మేస్తున్న ఒక గేదె ప్రమాదవశాత్తు ఆ వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు రూ. 1 లక్ష విలువైన గేదెను కోల్పోయిన రైతు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కన్నీటిపర్యంతమయ్యారు.