ఈపూరు: మద్యం బెల్టు షాపులకు అమ్మితే లైసెన్స్ రద్దు

826చూసినవారు
ఈపూరు: మద్యం బెల్టు షాపులకు అమ్మితే లైసెన్స్ రద్దు
ఈపూరు మండలంలోని ముప్పాళ్ల, మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని మద్యం దుకాణాలను ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో రికార్డుల ప్రకారం స్టాక్, బిల్లు నమోదులను పరిశీలించారు. నిర్దేశిత సమయాల్లోనే దుకాణాలు తెరిచి ఉండాలని, అధిక ధరలకు అమ్మకాలు జరిపినా, బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూసివేత, లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులు వంటి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్