వినుకొండ పట్టణంలో బుధవారం అర్థరాత్రి మద్యం సేవించిన కొందరు వ్యక్తులు కారుతో అల్లరి సృష్టించారు. అతివేగంగా దూసుకువచ్చిన కారు విద్యుత్ స్తంభం, బైక్, నెట్టుబండిని ఢీకొట్టి చివరికి ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.