నరసరావుపేట సబ్ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం పరామర్శించారు. తమ కార్యకర్తలపై అన్యాయంగా కేసుల నమోదు చేయడం దారుణమని, వారికి అండగా ఉంటామని, తప్పుడు కేసులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వినుకొండలో టీడీపీ అరాచక పాలన కొనసాగిస్తోందని, ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.