వినుకొండలో 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ: వృద్ధులకు భరోసా

909చూసినవారు
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు, జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం 19వ వార్డులోని రామాలయం వద్ద బుధవారం ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్‌ను అందజేశారు. వృద్ధులు, వితంతువులు, అనారోగ్య కారులతో మాట్లాడి, వారి సమస్యలు విని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా 100 మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్