వినుకొండలో సంచలనంగా మారిన సీఐపై అత్యాచార ఆరోపణలు

2363చూసినవారు
వినుకొండలో సీఐ చిన్న మల్లయ్యపై అత్యాచార ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఆ ప్రాంతంలో పనిచేసిన సీఐ తనపై బలవంతంగా అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం క్రైమ్, రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీసులు బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించి, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పోలీసు అధికారిపైనే ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు సేకరించాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.