స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 కార్యక్రమంపై పురపాలక సంఘం కమిషనర్ శివరామ ప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. తడి, పొడి, హానికర వ్యర్థాల సేకరణ, ప్రాసెసింగ్ విధానాలను వివరించారు. బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించి, పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించాలని సూచించారు. ఇంట్లోనే హోం కంపోస్ట్ తయారు చేసుకునే పద్ధతులపై కూడా అవగాహన కల్పించారు. కార్యక్రమం చివరలో విద్యార్థులు "స్వచ్ఛతా సర్వేక్షన్ - మా బాధ్యత!", "కంపోస్టింగ్ చేద్దాం - పరిస్థితి కాపాడదాం!" అంటూ నినాదాలు చేశారు.