వినుకొండలో బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు

4566చూసినవారు
వినుకొండలో బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు
వినుకొండ పట్టణ శివారులోని ఏనుగుపాలెం రోడ్డులో పెట్రోల్ బంకు సమీపంలో శనివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఏనుగుపాలెంకు చెందిన వారు బైక్‌పై వినుకొండకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్