వినుకొండ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ, మార్కెట్ కమిటీ సంయుక్తంగా పశువైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి, క్లస్టర్ ఇంచార్జ్ ముత్తినేని ఏడుకొండలు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్లు N.శ్రీరాములు, అమీర్, శివాజీ, మనోజ్‌లు వైద్య సేవలు అందించి, పశువుల పోషణ, వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ సహకారంతో లేగదూడలను ఏర్పాటు చేసి, మంచి జాతి పశువుల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు.