వినుకొండ: యూరియా, డీఏపీ పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు

1610చూసినవారు
వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో ఎరువుల కొరత ఉండకూడదని, యూరియా, డీఏపీ పక్కదారి పట్టించేవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువుల విషయంలో ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈసారి వర్షాలు బాగున్నాయని, సీజన్ ముందే ప్రారంభమైందని, ప్రతి ఊరికి అవసరమైన మేర ఎరువుల నిల్వలు ఉంచాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్