వినుకొండలో శనివారం ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.పి. కాలనీ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వయంగా ఆటో నడిపి డ్రైవర్లలో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.