పల్నాడు జిల్లాకు విశ్వకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని పల్నాడు జిల్లా సాధన సమితి కన్వీనర్ అట్లూరి విజయకుమార్ డిమాండ్ చేశారు. గురువారం వినుకొండలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు, పాదయాత్ర చేపడతామని తెలిపారు. వివిధ రాజకీయ, సామాజిక నాయకులు జాషువా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.