అబ్రహం కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందించిన వైసిపి నాయకులు

633చూసినవారు
అబ్రహం కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సహాయం అందించిన వైసిపి నాయకులు
వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం కంభంపాడు గ్రామంలో వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు పాలెపోగు అబ్రహం గుండెపోటుతో గురువారం మృతి చెందారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబానికి నూజండ్ల మండలం వైసిపి మాజీ కన్వీనర్ నక్కా నాగిరెడ్డి, ముఖ్య వైసిపి నాయకులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో ఆప్షన్ మెంబర్ స్వేనోమ్, మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ నరాలశెట్టి శ్రీనివాస్, బొల్లాపల్లి మండలం మాజీ జేసిఎస్ కన్వీనర్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్