
కార్తీకమాసం తొలి సోమవారం: శివాలయాల్లో భక్తజన సందోహం
పవిత్ర కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా వినుకొండలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి, శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీప కాంతులతో ఆలయాలు వెలిగిపోగా, లయకారుడి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు.

































