AP: పర్యాటకులకు శుభవార్త. 18 రోజులుగా నిలిచిపోయిన పాపికొండల బోటు ప్రయాణానికి అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో బోట్ల ఫిట్‌నెస్, లైఫ్ జాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కఠినమైన భద్రతా నియమాలు, సరికొత్త నిబంధనలతో దేవీపట్నం నుంచి ఈ విహారయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.