AP: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. బాలాజీ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం బీఎస్సీ కార్డియాలజీ విద్యార్థిని దిష్మాంజలి (19) కళాశాల యాజమాన్యం, సిబ్బంది వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. మంగళవారం హాస్టల్ గదిలో ఉరేసుకున్న విద్యార్థిని మృతదేహాన్ని పోలీసులు రుయాకు తరలించారు. బుధవారం కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు.