పిల్లల్లో కిడ్నీ సమస్యలు రాకుండా తల్లిదండ్రులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి తగినంత నీరు తాగించడం, ఉప్పు, కారం తక్కువగా ఉండేలా చూసుకోవడం, అనవసరమైన మందులు వాడకుండా ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడటం వంటివి చేయాలి. కుటుంబ చరిత్ర ఉన్న పిల్లలకు రెగ్యులర్ చెకప్స్ చేయించడం ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.