16 మంది పిల్లలను ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు

14084చూసినవారు
16 మంది పిల్లలను ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో 16 మంది చిన్నారులను ఏళ్ల తరబడి ఓ పాడుబడిన ఇంట్లో బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు మరో కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఇంటికి వెళ్లగా, అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న పిల్లలను గుర్తించి రక్షించారు. వారిని బంధించిన నలుగురు నిందితులపై 'చైల్డ్ ఎండేంజర్‌మెంట్' అభియోగాలు నమోదు చేసి అరెస్టు చేశారు. పిల్లల వయస్సు 18 నెలల నుంచి 18 ఏళ్ల మధ్య ఉంది. వీరిని బయటి ప్రపంచానికి దూరంగా, అమానవీయ పరిస్థితుల్లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్