బీహార్‌లోని ఫోర్బ్స్‌గంజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం రెండు ప్రాణాలను బలి తీసుకుంది. కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన డ్రైవర్ నబీ హుస్సేన్‌కు రోడ్డు పక్కన సత్తు అమ్ముకునే రవి చౌహాన్ వ్యక్తికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రవి పదునైన ఆయుధంతో నబీ హుస్సేన్ గొంతు కోయడంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన జనం రవిని కొట్టి చంపారు. క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.