పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఉభయ సభల్లోనూ పూర్తి మెజారిటీ లేకపోవడంతో, ఓటింగ్‌కు ముందు అసంతృప్తి రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలకు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రధాని
మోదీ విదేశీ పర్యటనలు, మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు జరగనున్నాయి.