హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR NGRI) పార్ట్-టైమ్ కౌన్సెలర్/సైకాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకియాట్రీ/సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తో పాటు ఏడాది అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 27 నుండి ప్రారంభమయ్యాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఇతరులకు రూ.175 ఫీజుగా నిర్ణయించారు. ఏప్రిల్ 6న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.ngri.res.in ను సందర్శించవచ్చు.