విశాఖలో భాగస్వామ్య సదస్సు.. వాణిజ్య ప్రతినిధులకు సీఎం ఆహ్వానం

2520చూసినవారు
విశాఖలో భాగస్వామ్య సదస్సు.. వాణిజ్య ప్రతినిధులకు సీఎం ఆహ్వానం
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే "భాగస్వామ్య సదస్సు"కు వాణిజ్య ప్రతినిధులను ఆహ్వానించారు. పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలను పంచుకోవాలని ఆయన కోరారు. ఈజీ ఆఫ్ బిజినెస్ లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, స్వర్ణాంధ్రప్రదేశ్-2047 లక్ష్యంగా సమగ్రాభివృద్ధి సాధిస్తామని తెలిపారు. అమరావతిలో 2026 జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభం కానుందని, ఏపీ 15 శాతం ఆర్థికాభివృద్ధి లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పారు.  ఏపీలో రెన్యువల్ ఎనర్జీకి అద్భుతమైన అవకాశాలున్నాయని, ప్రపంచస్థాయి ఓడరేవులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్