AP: స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని TDP అధినేత, CM చంద్రబాబు ఆదేశించారు. ఏ ఎన్నికల్లోనైనా గెలుపే ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఇగోలకు పోకుండా మిత్రపక్షాలతో సఖ్యతతో, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయాన్ని పునరావృతం చేసేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.