భారీ వర్షాలతో పాత బొబ్బిలి – ఆర్సీఎం చర్చి ప్రధాన రహదారి సుమారు 4 అడుగుల నీటిలో మునిగి, రెండు రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన శుక్రవారం ఉదయం స్వయంగా ప్రాంతాన్ని పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ విద్యాసాగర్‌తో మాట్లాడి, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న కాలువలు, గట్లను తొలగించి నీరు భైరవసాగరంలోకి వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.