వింత వ్యాధితో ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన దివ్యాంగుడు

882చూసినవారు
వింత వ్యాధితో ఆరేళ్లుగా మంచానికే పరిమితమైన దివ్యాంగుడు
బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన భీమసింగి సన్యాసిరావు ఆరు సంవత్సరాలుగా వింత వ్యాధితో మంచానికే పరిమితమయ్యారు. కాళ్లు, చేతులు పనిచేయకపోవడంతో వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఫలితం దక్కలేదు. కుటుంబ పోషణ భారంగా మారడంతో దాత మరడ భాస్కర్ (రాజేష్) నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కలెక్టర్ గ్రీవెన్స్‌లో సన్యాసిరావు దంపతుల పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్, వారికి అవసరమైన ధ్రువపత్రాలు, దివ్యాంగుల పెన్షన్, జీవనోపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. దాతలు తమకు సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్