బొబ్బిలి చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలీ.. సీపీఐ

337చూసినవారు
బొబ్బిలి చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలీ.. సీపీఐ
బొబ్బిలి పట్టణంలోని కోటి చెరువు, బైరి సాగరం వంటి ప్రధాన జలవనరుల విస్తీర్ణాన్ని సర్వే చేసి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకత్వం తహసీల్దార్ ఎం. శ్రీనుకు వినతిపత్రం బుధవారం సమర్పించింది. గొల్లపల్లి, మల్లంపేట రెవెన్యూ పరిధిలోని సుమారు 80 ఎకరాల కోటి చెరువు భూమిని కాపాడాలని, సగానికి పైగా కబ్జాకు గురైన బైరి సాగరం చెరువును గుర్తించి, బఫర్ జోన్‌లో అనుమతులు ఎలా ఇచ్చారో విచారణ చేపట్టాలని కోరింది. అమ్మిగారి కోనేరు, రామయ్య చెరువు వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణతో పాటు మునకాల శ్రీనివాస్, కోట అప్పన్న, కాగాన సంజీవ్ తదితరులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్