తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి: వైసీపీపై జనసేన నేత తీవ్ర ఆరోపణలు

110చూసినవారు
బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని, ఇది వైసిపి ప్రభుత్వం చేసిన మహా అపచారమని ఆరోపించారు. లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యి కాదని సిట్ తేల్చి చెప్పినా, వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి కొని, 235 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని, వైకాపా ప్రభుత్వం చేసిందంతా నేరమని ఆయన అన్నారు. ప్రమాదకరమైన రసాయనాలు కలిపి అపచారానికి పాల్పడ్డ వైకాపా నీచత్వాన్ని తెలియజేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్