ఆంజనేయస్వామి ఆలయానికి తొలగింపు ముప్పు

729చూసినవారు
బొబ్బిలి పట్టణంలోని మల్లంపేటలో సుమారు 20 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఆంజనేయస్వామి ఆలయానికి తొలగింపు ముప్పు ఏర్పడిందని స్థానికులు తెలిపారు. రైల్వే పనులకు ఆలయం అడ్డుగా వస్తోందని, త్వరలో విగ్రహాన్ని తొలగిస్తామని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానిక కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ఆలయ ధర్మకర్తలు రైల్వే అధికారులను కలిసి విగ్రహాన్ని తొలగించవద్దని కోరారు. ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్