మహిళలకు నేరాల నివారణపై అవగాహన

1చూసినవారు
మహిళలకు నేరాల నివారణపై అవగాహన
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని సీహెచ్ బొడ్డవలస, ఎ. వెలగవలస గ్రామాల్లో అభ్యుదయం 2.0 మరియు పబ్లిక్ పర్సెప్షన్ కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి ఎస్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలోబుధవారం మహిళలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులపై నేరాల నివారణ, డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, శక్తి యాప్ వినియోగం, రోడ్డు భద్రత నియమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.