బొబ్బిలికి రూ.46.89 కోట్ల జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు

723చూసినవారు
బొబ్బిలికి రూ.46.89 కోట్ల జల్‌జీవన్‌ మిషన్‌ నిధులు
విజయనగరం, బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే  బేబీనాయన ఆర్‌డబ్ల్యూఎస్‌, ప్రాజెక్ట్స్‌ శాఖ అధికారులతో శనివారం  సమీక్ష నిర్వహించారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద బొబ్బిలి నియోజకవర్గానికి రూ. 46. 89 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎస్‌ఏఎస్‌సీఐ ద్వారా రూ. 10. 21 కోట్లు మంజూరైనట్లు అధికారులు వివరించారు. జల్‌జీవన్‌ నిధుల్లో బొబ్బిలికి రూ. 16. 52 కోట్లు, తెర్లాంకు రూ. 11. 21 కోట్లు, బాడంగికి రూ. 9. 76 కోట్లు, రామభద్రపురానికి రూ. 9. 38 కోట్లు కేటాయించారు.

సంబంధిత పోస్ట్