విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ఎస్ఐ కొండలరావుకు స్థానిక గ్రీన్ బెల్ట్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. పట్టణంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అందిస్తున్న సేవలను గుర్తించి, ఆయన కృషికి ప్రశంసగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనను దుశ్శాలువాతో కప్పి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ బెల్ట్ సొసైటీ అధ్యక్షులు రమణమూర్తి మాస్టారు, ప్రతినిధులు శ్రీనివాసరావు మాస్టారుతో పాటు పలువురు స్థానికులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.