బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి సమీపంలో సాగునీటి కాలువలో పడి పిట్ట అప్పలనాయుడు (36) అనే యువకుడు మృతి చెందాడు. తిరుపతి నుంచి వస్తూ రైలులో కుటుంబ సభ్యుల నుంచి వేరుపడిన అప్పలనాయుడు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రావులపాలెం పోలీస్ పరిధిలో కాలువలో మృతదేహం లభించింది. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.