క్యాన్సర్ నియంత్రణ అవగాహనతోనే సాధ్యం: జె సి రాజు

382చూసినవారు
క్యాన్సర్ నియంత్రణ అవగాహనతోనే సాధ్యం: జె సి రాజు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బొబ్బిలిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ అవగాహన ర్యాలీ కార్యక్రమం బుధవారం  నిర్వహించారు. అవగాహనతో క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించి, ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్ జె సి రాజు అన్నారు. ధైర్యంతో క్యాన్సర్ ను జయించవచ్చని, క్రమబద్ధమైన జీవనశైలిని అలవరచుకోవాలని సూచించారు. ఎన్ అర్ ఐ హాస్పిటల్ సీఈఓ శ్రీనివాసన్ ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. క్యాన్సర్ కు భయపడాల్సిన పనిలేదని, అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని జి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్