విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామంలో బుధవారం స్వచ్ఛ రథం ద్వారా డ్రై వేస్ట్ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వడంపై ఎంపీడీవో రవికుమార్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎక్కువ మొత్తంలో డ్రై వేస్ట్ అందించిన వారికి వెంటనే బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.