విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో రూ.25 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హైబ్రిడ్ ఆన్యుటీ మోడల్ (HAM) పనులకు మంగళవారం సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన, జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. సీసీ, బీటీ రోడ్లు, సెంట్రల్ డివైడర్లు, వీధి దీపాలు, యుద్ధస్థంభం పార్కు అభివృద్ధి పనులు ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు.