అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీ నాయన) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నియోజకవర్గాల సమస్యలు, సాగునీటి వనరులు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. బొబ్బిలి పరిధిలో పారాది వంతెన, లోచర్ల-శివడవలస పథకం, గొల్లాది వంతెన, పట్టణ రోడ్ల అభివృద్ధికి నిధులు కోరారు. సీఎంకు కుమార్ రాజా చెరకు పంట ఫోటోను అందజేశారు. పెండింగ్ పనులకు ఊరట లభించే అవకాశం ఉందని తెలిపారు.