వర్షాల కారణంగా నీరు నిలిచిన ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంటాయకుల వీధిలో కూలే ప్రమాదంలో ఉన్న గోడను మున్సిపల్ సిబ్బంది, జేసీబీతో తొలగించారు. పట్టణంలోని శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయ ప్రాంతాలను సిబ్బందితో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. పాత బొబ్బిలి టి. బి. ఆర్. థియేటర్ వద్ద వరద తగ్గకపోవడంతో ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసి నీటిని మళ్లించే చర్యలు చేపడుతున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని కోరారు.