బొబ్బిలిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ, బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చి, మహాత్ముని తల్లి భరతమాతను అవమానించారని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీకి ఇది అవమానమని, పథకం పేరును తిరిగి మహాత్మా గాంధీ పేరు మీదుగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలతో భరత జాతి గౌరవాన్ని నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు, జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.