బొబ్బిలి అభివృద్ధిపై కాంగ్రెస్ నేత విమర్శలు

1029చూసినవారు
బొబ్బిలి అభివృద్ధిపై కాంగ్రెస్ నేత విమర్శలు
పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రకటించిన హైబ్రిడ్ ఆన్యూటీ మోడల్ పనులు ప్రజలకు ఆశలు కల్పించడానికే పరిమితమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు బొబ్బిలిలో విమర్శించారు. బొబ్బిలిలో రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు విగ్రహం నుంచి ఓంకార్ థియేటర్ వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు రహదారుల విస్తరణ చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్