డి.డి.ఓ. కిరణ్ కుమార్ కోమటిపల్లిలో పర్యటన: సచివాలయం, హెల్త్ సెంటర్ తనిఖీ

142చూసినవారు
డి.డి.ఓ. కిరణ్ కుమార్ కోమటిపల్లిలో పర్యటన: సచివాలయం, హెల్త్ సెంటర్ తనిఖీ
బొబ్బిలి మండలంలోని కోమటిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా అభివృద్ధి అధికారి (డి.డి.ఓ.) ఎం. కిరణ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, సిబ్బంది హాజరు పట్టిక, సేవల రిజిస్టర్లను పరిశీలించారు. ప్రజల వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం హెల్త్ సెంటర్‌ను సందర్శించి, అందుబాటులో ఉన్న మందులు, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆరోగ్య సిబ్బందికి సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్