గురజాడ అప్పారావు జయంతి సెప్టెంబర్ 21ను రాష్ట్ర పండుగగా ప్రకటించడంపై ఏపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర బాధ్యులు దాసరి వెంకట నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరంలో గురజాడ వారసులు వెంకట ప్రసాద్, ఇందిర దంపతులను సత్కరించారు. ప్రభుత్వ నిర్ణయంతో గురజాడ సాహిత్యం, భావాలను భావితరాలకు అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.